పాశ్చాత్య దుస్తులతో వినాయక విగ్రహాలు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాలు

by Malleboina Mahesh |

AI టెక్నాలజీ ఆధారితంగా పాశ్చాత్య దుస్తులతో వినాయక విగ్రహాలు తయారు చేయగా.. హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

పాశ్చాత్య దుస్తులతో వినాయక విగ్రహాలు.. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాలు
X

దిశ, వెబ్ డెస్క్: AI టెక్నాలజీ ఆధారితంగా పాశ్చాత్య దుస్తులతో వినాయక విగ్రహాలు (Ganesha idols) తయారు చేయగా.. హిందూ సంఘాలు (Hindu communities) తీవ్రంగా వ్యతిరేకించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. లఖే నగర్‌లోని ఒక పండల్‌లో AI ఫీచర్ చేసిన గణేశ విగ్రహం పాశ్చాత్య దుస్తులలో బొమ్మలతో నిలబడి ఉండటం, "అశ్లీల" ఐటెం సాంగ్స్ ("Obscene" item songs) వాయించడంపై రైట్ వింగ్ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిర్వాహకులు లైట్లు ఆపివేయమని, విగ్రహాలను వస్త్రంతో కప్పాలని నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వాతావరణం కాస్త సర్ధు మణిగింది.

ఇదిలా ఉంటే ఈ సంవత్సరం రాయ్‌పూర్ నగరం (Raipur city)లోని అనేక పండల్‌లలో యానిమేటెడ్ లుక్స్‌ (Animated looks)తో కూడిన గణేశ విగ్రహాలు, పాశ్చాత్య దుస్తులలో మహిళా విగ్రహాలతో బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాంటి విగ్రహాలపై మొదటి నుంచి హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విగ్రహాలు "రాయ్‌పూర్ అందమైన గణేశుడు"గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుండగా, ఆ విగ్రహాలను వెంటనే నిమజ్జనం చేయాలని డిమాండ్ చేస్తూ అనేక సంఘాల వారు నిరసనలు తెలిపారు. కానీ నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా.. మరో అడుగు ముందుకు వేసి.. వినాయక విగ్రహాలతో అశ్లీల ఐటెం సాంగ్స్ వాయించడం, డాన్స్ వేయించడం వంటివి చేయడంతో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.

Next Story