Hindi: ఆ స్కూళ్లలో హిందీ తప్పనిసరి కాదు.. మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ !

by B.Srinivas |

మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలన్న ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.

Hindi: ఆ స్కూళ్లలో హిందీ తప్పనిసరి కాదు.. మహారాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు హిందీ (Hindi)ని మూడో భాషగా తప్పనిసరి చేయాలన్న ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంలో హిందీ తప్పనిసరిగా చదవాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే మరాఠీ తప్పనిసరి అని, ఇంగ్లీష్ రెండో భాషగా ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి దాదాజీ భూసే (Bhoose) వెల్లడించారు. మూడో భాష విద్యార్థులు తమ ఇష్టానుసారం ఎంచుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)లో భాగంగా ఏ భాషనూ తప్పనిసరి చేయలేదని తెలిపారు. త్వరలోనే కొత్త ఆర్డర్స్ జారీ చేస్తామని తెలిపారు. అంతకుముందు హిందీని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వ భాషా సంప్రదింపుల కమిటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

కాగా, మహారాష్ట్రలోని మరాఠీ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై పలువురు విమర్శలు గుప్పించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్థవ్ థాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రేలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Next Story