- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hindi: మహారాష్ట్రలో మూడో భాషగా హిందీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
త్రి భాషా విధానంపై వివాదం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకు హిందీ చదవడం తప్పనిసరి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: త్రి భాషా విధానంపై వివాదం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి ఐదో తరగతి వరకు హిందీ (Hindi) చదవడం తప్పనిసరి చేసింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని మరాఠీ (Marathi), ఇంగ్లీష్ (English) మీడియం పాఠశాలలకు వర్తించనుంది. ప్రస్తుతం ఈ స్కూళ్లలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు మరాఠీ, ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నారు. తాజా ప్రభుత్వ ఆదేశాలతో ఈ స్కూళ్లలోనూ హిందీ బోధన తప్పనిసరి కానుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎన్ఈపీ ప్రకారం కొత్త పాఠ్యాంశాలు దశలవారీగా అమలులోకి రానున్నాయి. 2025-26 విద్యా సంవత్సరంలో 1వ తరగతితో ప్రారంభమై 2028-29 నాటికి అన్ని తరగతులకు విస్తరిస్తారు.
అయితే ఈ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇప్పటికే ఎన్ఈపీని అమలు చేస్తున్నట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మరాఠీని ఇప్పటికే తప్పనిసరి చేశామని, దేశవ్యాప్తంగా హిందీ కమ్యూనికేషన్ సాధనంగా ఉన్నందున ఆ భాషను సైతం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ చర్యలు మరాఠీ మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. ‘హిందీ ఐచ్ఛిక భాష అయితే ఎటువంటి సమస్యా ఉండేది కాదు. కానీ తప్పనిసరి చేయడం అంటే బలవంతంగా రుద్దినట్టే. మరాఠీ మనోభావాలను దెబ్బతీయడం తప్పు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో మరాఠీని మూడో భాషగా పెట్టాలని డిమాండ్ చేయొచ్చా’ అని ప్రశ్నించారు.






