Hindenburg: మూతపడనున్న ‘హిండెన్‌బర్గ్’.. నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-16 02:35:35  IST  )

అమెరికాకు చెందిన పెట్టుబడి పరిశోధన సంస్థ ‘హిండెన్‌బర్గ్’ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ఇవాళ సంచలన ప్రకటన చేశారు.

Hindenburg: మూతపడనున్న ‘హిండెన్‌బర్గ్’.. నాథన్ అండర్సన్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America)కు చెందిన పెట్టుబడి పరిశోధన సంస్థ ‘హిండెన్‌బర్గ్’ (Hindenburg) వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ (Nathan Anderson) ఇవాళ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే తాము హిండెన్‌బర్గ్ (Hindenburg) సంస్థను మూసి వేస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 2017లో ప్రారంభమైన సంస్థలో తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని తెలిపారు. జీవితంలో సరిపడా సహాసాలు చేశానని భావోద్వేగానకి లోనయ్యాడు. అయితే, హిండెన్‌బర్గ్ (Hindenburg) మూసివేత వెనుక ఎలాంటి భయాలు, బెదిరింపులు, వ్యక్తిగత, అనారోగ్య కారణాలు లేవని తెలిపాడు. కాగా, హిండెన్‌బర్గ్ కార్పొరేట్ మోసం (Corporate Fraud), అక్రమాలు, స్టాక్స్ మానిప్యులేషన్ (Manipulation of Stocks), అకౌంటింగ్ ఫ్రాడ్ (Accounting Fraud) వంటి వాటిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఇటీవలే అదానీ గ్రూప్‌ (Adani Group)పై సంచలన ఆరోపణలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Next Story