- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gujarat Election Result 2022 : హంగ్ దిశగా హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు!
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి

X
దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే సూచనలు కనిపించడం లేవు. మొత్తం 68 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు బీజేపీ 31, కాంగ్రెస్ 32 స్థానాల్లో మందంజలో ఉండగా.. 5 స్థానాల్లో స్వతంత్రులు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ 35కు చేరుకోవడం అటు బీజేపీకి గానీ ఇటు కాంగ్రెస్ కు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఫలితాల తుది దశ వరకు ఏమైనా మార్పులు వస్తాయేమో వేచి చూడాల్సిందే. ఒక వేళ తుది ఫలితాలు కూడా ఈ రకంగానే ఉంటే అక్కడ హంగ్ తప్పదు. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో స్వతంత్ర అభ్యర్థుల పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ నాయకులు స్వతంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.
Next Story






