హిమాచల్ ప్రదేశ్ గాలిలో కలిసిపోతుంది..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం వార్నింగ్

by Ajay Maddhiboyina |

హిమాచల్ ప్రదేశ్ గాలిలో కలిసిపోతుంది..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ టూరిజంపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అనియంత్రిత నిర్మాణాలు చేప‌డుతూ పర్యాట‌కులు భారీగా రావ‌డం ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదాయాన్ని ఆర్జించ‌డానికి ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌కూడ‌ద‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. త్వ‌ర‌గా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే హిమాయాల రాష్ట్రం దేశ‌ప‌టం నుండి అదృష్యమయ్యే రోజు ఎంతో దూరంలో లేద‌ని హెచ్చ‌రించింది. ఇటీవ‌లి కాలంలో రాష్ట్రం అనేక ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను చూసింద‌ని వ‌ర‌దలు పోటెత్త‌డం, ప‌ర్వ‌తాలు విరిగిప‌డ‌టం, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డటం లాంటివి ఎన్నో జ‌రిగాయ‌ని గుర్తు చేసింది. ప్ర‌కృతి వైప‌రీత్యాల వ‌ల్ల‌ ఇల్లు, భ‌వ‌నాలు కూలిపోవ‌డం ద్వారా వంద‌లాది మంది మ‌ర‌ణించార‌ని తెలిపింది.

ఈ ప‌రిణామాల‌న్నింటికీ మానుషులే కార‌ణమని జ‌స్టిస్ జెబి పార్దివాలా మ‌రియు మ‌హాదేవ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఇవి మాన‌వుల వ‌ల్ల‌నే వ‌చ్చాయ‌ని, ప్ర‌కృతికి ఆపాదించ‌డం స‌రికాద‌ని అభిప్రాయ‌పడింది. ప్ర‌కృతి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు అపార‌మైన అందాన్ని ఇచ్చింద‌ని, స‌హ‌జ సౌంద‌ర్యాన్ని స‌ద్వినియోగం చేసుకుని, ప్ర‌భుత్వం దీనిని ప‌ర్యాట‌క కేంద్రంగా ప్రోత్స‌హించేందుకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మించ‌డం ప్రారంభించింది. ఈ రోడ్లు నిర్మించ‌డానికి, ప‌ర్వ‌తాల‌ను నరికివేయ‌డానికి భారీ యంత్రాలు ఉప‌యోగించారు. దాని వ‌ల్ల‌నే ఈ ప్ర‌దేశం యొక్క స‌హ‌జ స‌మ‌తుల్య‌త క్షీనించింద‌ని కోర్టు అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

Next Story