- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ అంటే ఇది.. హైకింగ్‌కు వెళ్లి కోటీశ్వరులయ్యారు
సరదాగా హైకింగ్ (Hiking)కు వెళ్లిన ఇద్దరికి కోట్ల విలువైన నిధి దొరికింది. ఆ నిధిలో బంగారు నాణేలు, నగలతో పాటు.. పాతకాలం నాటి పొగాకు కూడా ఉంది. ఈ ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) లో వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: సరదాగా హైకింగ్ (Hiking)కు వెళ్లిన ఇద్దరికి కోట్ల విలువైన నిధి దొరికింది. ఆ నిధిలో బంగారు నాణేలు, నగలతో పాటు.. పాతకాలం నాటి పొగాకు కూడా ఉంది. ఈ ఘటన చెక్ రిపబ్లిక్ (Czech Republic) లో వెలుగుచూసింది. నార్త్ పోడ్కర్కోనోసి పర్వతాల్లోని అడవి వెలుపలి అంచుల్లో హైకింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు.. తమ కాళ్ల కింద ఏదో ఉందని అనిపించింది. తీసి చూస్తే అదొక నిధి. దానిలో ఉన్న బంగారం, ఆభరణాలు, నాణేల విలువ సుమారు రూ.2.87 కోట్లు. వాటిని స్వాధీనం చేసుకున్న ఈస్ట్ బోహేమియా మ్యూజియం.. 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు ఉన్నట్లు తెలిపింది. వాటి బరువు సుమారు 15 పౌండ్లు ఉంటుందని పేర్కొంది.
నిధిలో దొరికిన బంగారు నాణేలు 100 సంవత్సరాల క్రితంవిగా కనిపిస్తున్నాయని, 1808 నుంచి 19వ శతాబ్దం ప్రారంభం నాటివని చెప్పింది. ఈ నిధిని 1921 కాలంలో దాచిపెట్టి ఉంటారని భావించింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, ఓల్డ్ ఆస్ట్రియా - హంగేరీ నుంచి వచ్చిన కరెన్సీ కూడా ఈ నిధిలో ఉంది. నాణేలపై ఉన్న చిన్న గుర్తులు 1918-1992 వరకు ఉన్న పూర్వ యుగోస్లేవియాలో ముద్రించి ఉంటారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ నిధి ఫిబ్రవరిలోనే దొరికినా.. మ్యూజియం అధికారులు తాజాగా ఈ విషయం వెల్లడించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో నాజీలు రష్యన్ దళాలను బహిష్కరించినప్పుడు ముందుకు వస్తున్న రష్యన్ దళాల నుండి వెనక్కి తగ్గడం వల్ల ఈ నిధిని దాచి ఉంటారని అక్కడి ప్రజలు అభిప్రాయపడ్డారు.






