PHOTO: మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా

by Gantepaka Srikanth |

పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్(Prayag Raj) రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

PHOTO: మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా
X

దిశ, వెబ్‌డెస్క్: పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్(Prayag Raj) రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణి సంగమం భువిపై వెలసిన స్వర్గంలా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మహాకుంభమేళా(Kumbh Mela 2025)కు మూడు రోజుల్లో 6 కోట్ల మందికి పైగా హాజరయ్యారని సమాచారం. ఈ ఆధ్యాత్మిక క్రతువు కోసం యూపీ(Uttar Pradesh) ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లో భారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది.

రోడ్లు, పార్కులు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆధునాతన సీసీటీవీ కెమెరాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రయాగ్‌రాజ్‌ను స్మార్ట్‌ సిటీగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈసారి దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ సర్కారు కుంభమేళా నిర్వహణ కోసం ఏకంగా రూ.7వేల కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేసింది. కుంభమేళా కోసం నగరంలో ప్రధానంగా రోడ్లను అభివృద్ధి చేశారు. ట్రాఫిక్‌ను నివారించడానికి కొత్త ఫ్లైఓవర్‌లను నిర్మించారు.

Next Story