ఏపీ కేడర్ IPSకు బిగ్ ప్రియారిటీ.. దేశ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ దీక్షిత్

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతలను కట్టబెట్టింది.

ఏపీ కేడర్ IPSకు బిగ్ ప్రియారిటీ.. దేశ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ దీక్షిత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్‌ (Mahesh Deekshith)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు ఆయనను దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో (DIB) డైరెక్టర్‌గా నియమించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2022 నుంచి అదే పదవిలో ఉన్న తపన్ కుమార్ దేకా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. తాజాగా కేబినెట్ నియామకాల కమిటీ ఐబీ స్పెషల్ డైరెక్టర్ మహేశ్ దీక్షిత్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా నియమించడానికి ఆమోదం తెలిపింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 సంవత్సరాల కాలానికి, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆ పదవిలో మహేశ్ దీక్షిత్ కొనసాగనున్నారు.

Next Story