వైద్యుల నిర్లక్ష్యం.. నేలపైనే ప్రసవించిన గర్భిణీ

by Sujitha Rachapalli |

ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా మహిళా ఆస్పత్రిల్లో దారుణమైన నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంది నిండు గర్భిణీ. కుటుంబం, ఆశావర్కర్‌తో కలిసి ప్రసవ వేదనతో ఆస్పత్రికి చేరుకుంది మహిళా. అత్యవసర అడ్మిషన్‌ కోసం వెయిట్ చేసినా.. డ్యూటీ డాక్టర్ సలోని కనికరించలేదు.

వైద్యుల నిర్లక్ష్యం.. నేలపైనే ప్రసవించిన గర్భిణీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా మహిళా ఆస్పత్రిల్లో దారుణమైన నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంది నిండు గర్భిణీ. కుటుంబం, ఆశావర్కర్‌తో కలిసి ప్రసవ వేదనతో ఆస్పత్రికి చేరుకుంది మహిళా. అత్యవసర అడ్మిషన్‌ కోసం వెయిట్ చేసినా.. డ్యూటీ డాక్టర్ సలోని కనికరించలేదు. ఇక్కడ డెలివరీ చేయమని వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. కానీ ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో ఆశా వర్కర్, ఫ్యామిలీ సంకోచించారు. చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ ప్రయోజనం లేకపోవడంతో.. ఆశావర్కర్ ధైర్యంగా చొరవతీసుకుంది. తనే దగ్గరుండి పురుడపోసింది. తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అయితే డెలివరీ చేస్తున్నప్పుడు కూడా అక్కడి వైద్యులు, నర్సులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారే తప్ప ఆశావర్కర్‌కు హెల్ప్ చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో గర్భిణీ కుటుంబీకులు వీడియో తీస్తుండగా.. డాక్టర్ సలోని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. ఆ వీడియో డిలీట్ చేయాలని డిమాండ్ చేసింది. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వీడియో తీయడమే కాదు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయిపోయింది.

Next Story