- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రికి బాంబే హైకోర్టు సమన్లు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది. 2024లో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల వినోద్ రావ్ గుడాదే పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు బాంబే హైకోర్టు సమన్లు జారీ చేసింది. 2024లో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి ప్రఫుల్ల వినోద్ రావ్ గుడాదే పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో జరిగిన విధానపరమైన లోపాలు, అవినీతిని ఆరోపిస్తూ ఫడ్నవీస్ విజయం చెల్లదని హైకోర్టు ప్రకటించాలని వినోద్ రావ్ కోరారు. "మే 8న జస్టిస్ ప్రవీణ్ పాటిల్ ధర్మాసనం సీఎం ఫడ్నవీస్‌కు సమన్లు జారీ చేసింది" అని గుడాధే న్యాయవాది పవన్ దహత్ వెల్లడించారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ గురువారం నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల పోలింగ్ సమయంలో నిబంధనలు పాటించలేదని వినోద్ రావ్ పేర్కొన్నారు.
మరో ఇద్దరికి..
కాగా.. నాగ్ పూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి ఫడ్నవీస్ సహా కాంగ్రెస్‌కు చెందిన ప్రఫుల్ల వినోద్‌రావ్ గుడాదే పోటీ చేశారు. కాగా.. వినోద్ రావ్ ఫడ్నవీస్ చేతిలో 39,710 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతేకాకుండా, ఇలాంటి ఎన్నికల పిటిషన్లపై మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. నాగ్‌పూర్ వెస్ట్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మేట్, చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ స్థానానికి చెందిన కీర్తికుమార్ భాంగ్డియాలకు కూడా హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఇకపోతే, గతేడాది మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మహాయుతి కూటమి 230 స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠమెక్కారు.






