- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రులు, ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. ఆలయాల్లో VIP దర్శనాలపై హైకోర్టు సంచలన ఆదేశాలు
దేవాలయాల్లో నడుస్తున్న వీఐపీ సంస్కృతి, ప్రత్యేక రుసుములతో కూడిన పెయిడ్ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేవాలయాల్లో నడుస్తున్న వీఐపీ సంస్కృతి, ప్రత్యేక రుసుములతో కూడిన పెయిడ్ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. “దేవుడి ముందు భక్తులందరూ సమానులే. కేవలం ఆర్థిక స్థితిని బట్టి భక్తుల మధ్య వివక్ష చూపడం, వీఐపీల కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టడం భగవంతుడు కూడా క్షమించని తీవ్రమైన 'ఆధ్యాత్మిక పాపం' (Religious Sin)" అని న్యాయస్థానం ఘాటుగా పేర్కొంది. తమిళనాడులోని మురుగన్ ఆలయాల్లో ఒకటైన ప్రముఖ తిరుచెందూర్ అరుల్మిగు సుబ్రమణ్య స్వామి' ఆలయ నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో వీఐపీ దర్శనాల నియంత్రణపై దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
'భగవంతుడు ఒక్కడే వీఐపీ'..
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్.ఎమ్. సుబ్రమణ్యం ధర్మాసనం, ఆలయాల్లో వీఐపీ సంస్కృతిపై భక్తుల్లో ఉన్న అసంతృప్తిని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది: "దేవాలయాలు లాభార్జన కోసం నడిచే సంస్థలు కావు. భగవంతుడిని దర్శించుకోవడానికి వచ్చే వీఐపీలు కూడా అక్కడి కేవలం భక్తులే. ఆలయ ప్రాంగణాల్లో కేవలం 'భగవంతుడు ఒక్కడే వీఐపీ, వీఐపీల ప్రత్యేక దర్శనాల కారణంగా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. ఒకవేళ వీఐపీల వల్ల సామాన్యులు ఇబ్బంది పడేతే, వారు పెట్టి శాపనార్థాలు, ఆవేదన ఆ వీఐపీలకే చుట్టుకుంటాయి." అలాగే, డబ్బులు ఎక్కువ ఇస్తే దేవుడికి దగ్గరగా తీసుకెళ్లడం, ఉచిత దర్శనం చేసుకునే వారిని దూరం నుండి చూపించడం వంటి పద్ధతులు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (Article 14), మత స్వేచ్ఛ (Article 25) నిబంధనలకు విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టు జారీ చేసిన కీలక ఆదేశాలు..
తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించాలి. వీఐపీ సౌకర్యం కేవలం ఆయా పదవుల్లో ఉన్న వ్యక్తులకు, వారి తక్షణ కుటుంబ సభ్యులకు (భార్య భర్త, పిల్లలు) మాత్రమే వర్తిస్తుంది. వారి బంధువులను, స్నేహితులను వీఐపీలుగా పరిగణించేకూడదు. వీఐపీలతో పాటు వచ్చే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది లేదా ఆలయ ఉద్యోగులు ప్రత్యేక క్యూలైన్లలో వెళ్లడానికి వీల్లేదు. వారు సాధారణ లేదా పెయిడ్ లైన్లలోనే వెళ్లాలి. వీఐపీల ప్రత్యేక దర్శన సమయాన్ని కేవలం 10 నిమిషాలకు మాత్రమే పరిమితం చేయాలి. గర్భగుడి ముందు ఎక్కువ సమయం కూర్చోవడం లేదా నిలబడటం ద్వారా ఇతరుల దర్శన హక్కును కాలరాయకూడదు. పెద్ద పెద్ద దేవాలయాల్లో రూ. 300 నుండి రూ. 500 వరకు పెయిడ్ టికెట్లు పెట్టి, 'ద్రవిడ ధర్మం' పేరిట క్లాస్ సిస్టమ్ (ఆర్ధిక వివక్షను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన పిటిషన్లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. సనాతన ధర్మంలో ధనిక, పేద అనే తేడా లేదని, డబ్బు అనేది దేవుడిని చేరుకోవడానికి సాధనం కాకూడదని పేర్కొంటూ. ఈ విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హిందూ సమయ ధర్మాదాయ శాఖ (HR&CE), పర్యాటక శాఖలకు మద్రాస్ హైకోర్టు వెక్టేషన్ బెంచ్ (జస్టిస్ జీ.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్) నోటీసులు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణీలు, వికలాంగులు, నూతన వధూవరులకు ఇచ్చే మినహాయింపులు మినహా.. మిగిలిన అన్ని రకాల పెయిడ్ కల్చర్, వీఐపీ హంగామాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు తేల్చి చెప్పింది.






