బక్రీద్‌కు గోవులను బలివ్వడంపై హైకోర్టు కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

బక్రీద్ పండుగ వేళ మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పండుగ‌కు ముందు లేదా పండుగ రోజు, మ‌రే ఇత‌ర‌రోజున ఆవును లేదా దూడ‌ను వ‌ధించ‌కుండా చూడాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

బక్రీద్‌కు గోవులను బలివ్వడంపై హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: బక్రీద్ పండుగ వేళ మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. పండుగ‌కు ముందు లేదా పండుగ రోజు, మ‌రే ఇత‌ర‌రోజున ఆవును లేదా దూడ‌ను వ‌ధించ‌కుండా చూడాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. బ‌క్రీద్ ఉత్స‌వాల సంద‌ర్భంగా బ‌హిరంగ, అనుమ‌తి లేని ప్ర‌దేశాల్లో గోవ‌ధ‌ను నివారించాల‌ని కోయంబ‌త్తూరుకు చెందిన సూర్య ప్ర‌శాంత్ అనే వ్య‌క్తి దాఖలు చేసిన‌ పిటిష‌న్ పై జ‌స్టిస్ జిఆర్.స్వామినాథ‌న్, జ‌స్టిస్ వి. ల‌క్ష్మినారాయ‌ణ్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. అనంత‌రం గోవ‌ద‌ను నిషేదించాల‌ని రాష్ట్ర డీజీపీ, ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించింది.

జంతు వ‌ధ‌ను తాత్కాలిక లేదా అన‌ధికారిక ప్ర‌దేశాల్లో నిర్వ‌హించ‌కూడ‌దని, చ‌ట్ట‌బ‌ద్ధంగా ఆమోదించ‌బ‌డిన వ‌ధ‌శాల‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయాల‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఆవులు, దూడ‌లు ఇత‌ర పాలిచ్చే, వ్య‌వ‌సాయానికి ప‌నికి వ‌చ్చే ప‌శువుల వ‌ధ‌నున నిషేదించే దిశ‌గా కృషి చేయాల‌ని ఇప్ప‌టికే రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 48 పేర్కొంద‌ని కోర్టుతెలిపింది. అంతే కాకుండా సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల‌ను ఉటంకిస్తూ బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా గోవుల‌ను బ‌లి ఇవ్వ‌డం ఇస్లాంలో త‌ప్ప‌నిస‌రి మ‌త‌ప‌ర‌మైన విధి కాద‌ని ధ‌ర్మాస‌నం పున‌రుద్ఘాటించింది.

Next Story