- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ బ్లాస్ట్.. ముంబైలో చెక్ పోస్టులు కట్టుదిట్టం
రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో జరిగిన బ్లాస్ట్ యావత్ భారతాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో జరిగిన బ్లాస్ట్ యావత్ భారతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఎర్రకోట సమీపంలో ఉన్న చాందినీ చౌక్ మెట్రోస్టేషన్ సమీపంలో పార్కింగ్ లో ఉన్న ఒక కారు పేలడంతో 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుళ్లలో 8 మంది మృతి చెందగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సహాయకచర్యలు చేపట్టి.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మంటలు సమీపంలోని షాపులకు కూడా వ్యాపించడంతో.. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో సంభవించిన పేలుడుతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా బలగాలను మోహరించి భద్రతను పెంచాలని ఉన్నతాధికారులు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచాలని లక్నో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ జిల్లాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు.






