- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BIG DAY: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హైఅలర్ట్..!
గడిచిన రెండేళ్లలో భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ కగార్' మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తీసింది.

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన రెండేళ్లలో భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ కగార్' మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తీసింది. అడవుల్లోకి చొచ్చుకువెళ్లిన బలగాలు, మావోయిస్టుల కంచుకోటలను ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో పార్టీకి దిశానిర్దేశం చేసే అగ్రనేతలు నేలకొరిగారు. బస్వరాజు, మోస్ట్ వాంటెడ్ నేత హిడ్మాలు ఎన్‌కౌంటర్లలో మరణించడం మావోయిస్టు శ్రేణులను కుదిపేసింది. మరోవైపు.. పార్టీ సిద్ధాంతకర్తలు, కీలక సభ్యులైన దేవ్‌జీ, మల్లోజుల, ఆశన్న, రాజిరెడ్డి వంటి నేతలు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవడం మావోయిజం పతనాన్ని స్పష్టం చేసింది.
అజ్ఞాతంలోనే గణపతి.. ఎక్కడ?
ఇన్ని పరిణామాలు జరుగుతున్నా, మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉండటం భద్రతా దళాలకు సవాలుగా మారింది. ఆయన ఇప్పటికే సరిహద్దులు దాటారా లేదా ఛత్తీస్‌గఢ్ లోతట్టు అడవుల్లోనే ఉన్నారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ముగింపు..
నేటితో అమిత్ షా గడువు ముగిసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మావోయిజం 'క్లీన్ స్వీప్' ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బలగాలు హై అలర్ట్‌లో ప్రకటించాయి.






