- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
High Alert : దేశంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)కు శుక్రవారం పార్లమెంటు(Parliament) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill)కు శుక్రవారం పార్లమెంటు(Parliament) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. నేడు ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ పడిన వెంటనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ముస్లిం సంఘాలు భారీ నిరసన ర్యాలీలు(Protest Rallies) చేపట్టాయి. తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో హై అలర్ట్(High Alert) ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించగా, ఢిల్లీలో DMK ఎంపీలు ఈరోజును "ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే"గా అభివర్ణించారు, అలాగే అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(All India Muslim Personal Law Board) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును కోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. భోపాల్‌లో కొంతమంది ముస్లిం మహిళలు ఈ బిల్లుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. కోల్ కతా లో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా శుక్రవారం సాయంత్రానికి ఈ ఆందోళనలు మరింత ఉదృతం అయ్యే అవకాశం ఉండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాలు భారీగా పోలీసు బలగాలను మోహరించాయి.
కాగా వక్ఫ్ బిల్లు-2024 అనేది భారత ప్రభుత్వం వక్ఫ్ చట్టం-1995లో కొన్ని సవరణలు చేయడానికి ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన చట్టం. ఇది 2024 ఆగస్టు 8న లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కేంద్రా ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలన తర్వాత నేడు అనగా 2025 ఏప్రిల్ 4 నాటికి పార్లమెంటు రెండు సభల్లో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఈ బిల్లు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీస్తోంది. పలు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి హై అలర్ట్ పరిస్థితి ఏర్పడింది.
ఈ సవరణ బిల్లులో.. వక్ఫ్ బోర్డుల అధికారాలను కొంతమేర తొలగించడం, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తప్పనిసరి చేయడం, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతర సభ్యులను చేర్చడం వంటి సంస్కరణలను చేపట్టింది. ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు దీనిని మైనారిటీ హక్కులపై దాడిగా భావించి, రాజ్యాంగ విరుద్ధమని విమర్శిస్తున్నాయి.






