- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిడ్మా అంత్యక్రియలు.. ఆదివాసుల రోదనలతో దద్దరిల్లిన పూవర్తి
by Muthe.Rajitha |
మావోయిస్టు అగ్రనేత హిడ్మా అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో పూర్తయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : మావోయిస్టు అగ్రనేత హిడ్మా అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో పూర్తయ్యాయి. ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లాలోని పూవర్తిలోని బందెపారలో హిడ్మా, అతని భార్య రాజె అంత్యక్రియలు వందలాది ఆదివాసుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. హిడ్మా ఎన్కౌంటర్ లో మృతి చెందిన వార్త తెలియగానే పూవర్తిలోని పలు గుంపుల్లో గల ఆదివాసీలతోసహా ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా, బీజాపూర్ వంటి జిల్లాల నుంచి వేలాదిగా ఆదివాసులు, నక్సల్స్ సానుభూతి పరులు తరలివచ్చారు.
బందెపారలోని హిడ్మా ఇంట్లో వృద్ధురాలైన అతని తల్లి పుంజి ఏడుస్తుండటం అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఆమె ఏడుస్తున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. హిడ్మా అంత్యక్రియల సమయంలో ఆ ప్రాంతం అంతా ఆదివాసీల రోదనలతో దద్దరిల్లింది.
Next Story






