- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hementh: రేపు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం.. హాజరు కానున్న కీలక నేతలు
జార్ఖండ్14వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొరాబాదీ మైదానంలో గవర్నర్ గంగ్వార్ సోరెన్‌తో ప్రమాణం చేయిస్తారు.

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్14వ సీఎంగా హేమంత్ సోరెన్ (Hemanth soren) గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీ(Ranchee)లోని మొరాబాదీ మైదానం (Mora baadhi Ground)లో సాయంత్రం 4 గంటలకు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ (Santhosh gangvar) సోరెన్‌తో ప్రమాణం చేయిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రాంచీ అంతటా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Malli karjun karge), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi), ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamatha benarjee), పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సహా ఇండియా కూటమి కీలక నేతలు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సోరెన్ ఒక్కరు మాత్రమే సీఎంగా ప్రమాణం చేస్తారని సమాచారం. రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) నేతృత్వంలోని కూటమి 81 సీట్లకు గాను 56 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.






