Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ. 25 వేల నగదు ప్రోత్సాహం: గడ్కరీ

by Prasad Jukanti |   (  Updated:2025-12-18 10:42:00  IST  )

Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే రూ. 25 వేల నగదు ప్రోత్సాహం: గడ్కరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం అందించి ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడేవారికి రూ. 25 వేలు ప్రోత్సహకం కొనసాగిస్తున్నామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మరోసారి స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేస్తే పోలీసులు కేసులు, కోర్టు ఇబ్బందులు తప్పవని చాలా మంది సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. కానీ సకాలంలో బాధితులను ఆసుపత్రిలో చేరిస్తే చాలా మంది ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారని అందువల్ల ప్రమాద బాధితులకు సహాయం అందించే వారిని 'రాహ్ వీర్' (Raahveer Award) గా గుర్తించి వారికి రూ. 25 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చే వారికి పోలీసులు, కోర్టులతో ఇబ్బందులు ఉండకుండా చూస్తామన్నారు. ఇవాళ లోక్‍సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన గడ్కరీ పలు కీలక అంశాలపై వివరణలు ఇచ్చారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన వారికి మొదటి ఏడు రోజులు చికిత్స అందించేందుకు అయ్యే ఖర్చును రూ.1.5 లక్షల వరకు ప్రభుత్వం భరించనున్నట్టు ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. కాగా నిన్న గడ్కరీ లోక్ సభలో మాట్లాడుతూ శాటిలైట్ ఆధారిత టోల్ చార్జీల వసూలుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా జాతీయరహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్‌చార్జీల వసూలు వ్యవస్థను అమలుచేస్తామని తెలిపారు.

Next Story