మంచు గుప్పిట్లో కశ్మీర్

by Muthe.Rajitha |

భూతల స్వర్గం కశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది.

మంచు గుప్పిట్లో కశ్మీర్
X

దిశ, వెబ్ డెస్క్ : భూతల స్వర్గం కశ్మీర్ మంచు గుప్పిట్లో చిక్కుకుంది. ఉత్తర భారతం చలితో వణికిపోతోంది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తోపాటు ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. గుల్‌మార్గ్‌, సోనామార్గ్‌, దూద్‌పత్రి సహా దక్షిణ, ఉత్తర కశ్మీర్‌ ప్రాంతాలు తెల్లని మంచు దుప్పటితో కప్పబడ్డాయి. భారీ హిమపాతం వల్ల రోడ్లు బ్లాక్ అవడంతో ప్రజలతోపాటు, పర్యటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో జమ్ము–శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో శీతాకాల సన్నద్ధతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రోడ్డు క్లియరెన్స్‌, నిరంతర విద్యుత్‌, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సీఎం తెలిపారు.

Next Story