- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర భారత దేశంతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా మధ్యప్రదేశ్(MadhyaPradesh) లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే బరేలా-కుందం ప్రాంతం మధ్యలో గల పరియత్ నది ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఈ నదిపైగల బ్రిడ్జి మీది నుంచి వరద ప్రవాహం ఉదృతంగా ఉండటంతో అధికారులు ఆ దారిని మూసివేశారు.
అయితే ఓ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న లారీ డ్రైవర్ మాత్రం ఇవేవీ పట్టనట్టు ఆ బ్రిడ్జి మీది నుంచి లారీని ముందుకు నడిపించడంతో.. నది ప్రవాహానికి సిలిండర్లతో సహ లారీ నదిలో కొట్టుకు పోయింది. అయితే డ్రైవర్, క్లీనర్ మాత్రం ముందుగానే నదిలో దూకి ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Next Story






