ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. 107 ఏళ్ల రికార్డు బద్దలు

by Vemula.Srinu Prasad |

ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి..

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. 107 ఏళ్ల రికార్డు బద్దలు
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై(Mumbai)లో భారీ వర్షం(heavy rain) కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. దీంతో ముంబై నగరం మొత్తం నీట మునిగిపోయింది. బలదిగ్భందంలో పలు రైల్వే స్టేషన్లు చిక్కుకున్నాయి. విమాన సర్వీసులకు సైతం అంతరాయం కలిగింది. మెట్రో స్టేష‌న్‌లోనూ భారీగా వర్షపు నీరు చేరింది. స్టేషన్ మెట్లపై నుంచి జారుతున్న నీరు జలపాతాన్ని తలపించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ లోకి పలువురు వెళ్లలేకపోయారు. మరికొందరు బయటకు రాలేక ఇబ్బందులు పడ్డారు.

107 ఏళ్ల క్రితం నమోదైన వర్షపాతాన్ని ఈ సారి కురిసిన వర్షం రికార్డు తిరగరాసింది. 135 మి.మి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో 10.5 సెంమీ, మరికొన్ని ప్రాంతాల్లో 55 మి.మి వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షం దెబ్బతో ముంబైలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీర చేరింది. అండర్ పాస్‌ల వద్ద బస్సులు, కార్లు వరదలో చిక్కుపోయాయి. భారీ ఎదురు గాలులతో చెట్లు పడిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో ముంబైకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Next Story