- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దంచికొడుతోన్న వర్షాలు.. ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ
నైరుతి రుతుపవనాల కారణంగా కేరళ (Kerala) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: నైరుతి రుతుపవనాల కారణంగా కేరళ (Kerala) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) రాష్ట్రంలో మొత్తం 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాలు 24 గంటల్లో 20 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక కేరళ తీరం వెంట గంటలకు 35 నుంచి 45 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.
ప్రస్తుతం అలప్పుజ, ఎర్నాకులం, కన్నూర్, కాసర్‌గోడ్, కొల్లం, కోజికోడ్, మలప్పురం, త్రిస్సూర్ తీర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జాలర్లు ఎవరూ వేటకు వెళ్లకూడదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షపాతం నమోదైంది. నీలంబూర్‌లో 16 సెం.మీ., వైతిరిలో 15 సెం.మీ., కరిపూర్ విమానాశ్రయం, కన్నూర్, మన్నార్‌క్కాడ్, ఉరుమి, చెంబెరి, కన్నూర్ విమానాశ్రయంలో 13 సెం.మీ., కంజిరపుజలో 12 సెం.మీ., ఇరిక్కూర్, అయ్యన్‌కున్నులో 11 సెం.మీ., అలువా, క్విలాండిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు.






