తమిళనాడులో వర్ష భీభత్సం.. పర్యాటక ప్రదేశాలు మూసివేత

by Ajay Maddhiboyina |

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నీలగిరి జిల్లా పూర్తిగా ధ్వంసం అయింది. జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి, భారీ వృక్షాలు విరిగిపోయాయి.

తమిళనాడులో వర్ష భీభత్సం.. పర్యాటక ప్రదేశాలు మూసివేత
X

దిశ‌, వెబ్ డెస్క్:తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నీలగిరి జిల్లా పూర్తిగా ధ్వంసం అయింది. జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి, భారీ వృక్షాలు విరిగిపోయాయి. దీంతో ప‌లు గ్రామాల మ‌ధ్య‌ రాక‌పోక‌ల‌కు అంత‌రాయం ఏర్పండింది. ఈ జిల్లాతో పాటూ కోయంబత్తూర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వీటితో పాటూ తేని, తిరునల్వేలి సహా మరో ఆరు జిల్లాలకు ఆరెంట్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల పాటూ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను మూసివేస్తున్న‌ట్టు తెలిపారు.

అనేక జిల్లాల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. మ‌రోవైపు వ‌ర్షాల కార‌ణంగా ప్రాజెక్టుల్లోకి కూడా భారీగా నీరు చేరింది. తిరున‌ల్వేలి జిల్లాల్లో పాప‌నాసం ప్రాజెక్టులో నీటిమ‌ట్టం గ‌ణ‌నీయంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స‌మార్థ్యం 5,500 క్యూసెక్కులు అయితే ప్ర‌స్తుతం నీటి నిల్వ 2,900 క్యూసెక్కుల వ‌ద్ద ఉంది. వ‌ర్షాకాలం ప్రారంభంలోనే ప‌రిస్థితి ఇలా ఉంటే త‌ర‌వాత ఎలా ఉండ‌బోతుందో అని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ ఆదేశాల‌తో అధికారులు అప్ర‌మ‌త్త‌మై ప‌రిస్థితులను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

Next Story