15వ తేదీ వరకూ భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

ఉత్తరాది రాష్ట్రాల్లో ఈనెల 15వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.

15వ తేదీ వరకూ భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాది రాష్ట్రాల్లో ఈనెల 15వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండగా.. భారీ వరదల కారణంగా అనేకమంది నిరాశ్రయులయ్యారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుండగా.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

గురువారం సాయంత్రం 5.30-8.30 గంటల సమయంలో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నజాఫ్ గఢ్ వాతావరణ కేంద్రం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆ తర్వాత అయా నగర్లో 50.5 మిల్లీమీటర్లు, ప్రగతి మైదాన్ లో 37 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గురుగ్రామ్ సహా ఎన్సీఆర్ లోని అనేక ప్రాంతాలు జలమయమవ్వగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నెహ్రూ ప్లేస్, అరబిందో మార్గ్, లజ్ పత్ నగర్ వంటి ప్రాంతాల్లో రోడ్లు నీట మునగడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Next Story