- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో వర్ష భీబత్సం.. 6గురు మృతి మరో 5గురు గల్లంతు
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వానలు భీబత్సం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపిలేని వానలు భీబత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా నాందేడ్‌లో ఆరుగురు మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర అంతటా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నాందేడ్ లో నలుగురు మరణించగా, ముంబైలో ఒకరు మరణించారు.
అంతే కాకుండా నాందేడ్ జిల్లాలో వరదల కారణంగా నలుగురు గల్లంతవ్వగా, ముంబైలో ఒకరు గల్లంతయ్యారు. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 18 ఎన్డీఆర్ బృందాలు, ఆరు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నాందేడ్‌లో ముఖేడ్ తాలూకాలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటి వరకు 293 మందిని రక్షించాయని అధికారులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షం జనజీవనానికి అంతరాయం కలిగించడంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.






