భారీ వర్షాలు.. ట్రాఫిక్‌కు అంతరాయం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

by Naga Rani Yarlagadda |

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు.. ట్రాఫిక్‌కు అంతరాయం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమవ్వగా.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. అహ్మదాబాద్, పటాన్ లోని సిధ్ పూర్ పట్టణాల్లో కురిసిన వర్షాలకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు రానున్న వారంరోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

ఆదివారం ఉదయం వరకూ రాష్ట్రంలోని బనస్కాంతలో గల వాడ్గామ్ ప్రాంతంలో అత్యధికంగా ఏడున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. మోడాసాలో 6.25, తలోడ్ లో 5.5, సిధ్ పూర్ లో 5.25, కప్రాడా, దహేగామ్ లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా.. రానున్న కొన్ని గంటల్లో బనస్కాంత, సబర్ కాంత, ఆరావళి, ఖేడా, పటాన్, మోహనాసా, గాంధీనగర్, అహ్మదాబాద్, సురేంద్రనగర్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Next Story