- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో డేంజర్ గాలులు...రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో గంటకు 60 నుండి 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని హెచ్చరించింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో గంటకు 60 నుండి 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఢిల్లీతో పాటూ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటూ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు మూడు రోజుల క్రితం కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
పిడుగులు పడి ఏకంగా ఆరుగురు మరణించారు. ఘజియాబాద్, ఢిల్లీ మరియు గ్రేటర్ నోయిడాలో ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు పిడుగుపాటుకు కన్నుమూశారు. భారీగా వీచిన ఈదురుగాలుల కారణంగా ప్రాణనష్టంతో పాటూ ఆస్తినష్టం కూడా చోటు చేసుకుంది. మరోవైపు ప్రస్తుతం ఢిల్లీలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఢిల్లీలో ఎండాకాలం ఇలాంటి వాతావరణం లేదని వాతావరణ కేంద్రం చెబుతోంది.






