- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో భారీ వర్షం ఎఫెక్ట్.. 100 విమానాలు ఆలస్యం, 40 ఫ్లైట్ల దారి మళ్లింపు
మండు వేసవిలో వర్షాలు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని అతలాకుతలం చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మండు వేసవిలో వర్షాలు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ద్వారక, ఖాన్పూర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్, మోతీబాగ్ ప్రాంతాలను ముచ్చెత్తింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉదయం పూట ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీలో రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.
రాబోయే 24 గంటల్లో తీవ్రమైన ఉరుములు, తుఫాను గంటకు 70 కి.మీ నుంచి 80 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక ఢిల్లీ (Delhi)-NCRతో సహా అనేక ప్రాంతాల్లో శుక్రవారం కూడా ఉరుములు, మెరుపులు, గంటకు 40–90 కి.మీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో తాజా సమాచారం మొత్తం 100 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మరో 40 విమానాలను దారి మళ్లించినట్లుగా ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పేర్కొన్నారు.






