- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురవడంతో భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయి, కిమీల మేర ట్రాఫిక్ జాంలు అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెహ్రూ ప్లేస్, ఔరబిందో మార్గ్, కైలాష్ కాలనీ, లజ్‌పత్ నగర్, సిరీ ఫోర్ట్ రోడ్, చిరాగ్ ఢిల్లీ ఫ్లైఓవర్, ఔటర్ రింగ్ రోడ్, జీకే మార్గ్, ఐటీవో, పుల్ ప్రహ్లాద్‌పూర్, ఎంబీ రోడ్ వంటి ఢిల్లీలోని పలు ప్రాంతాలతోపాటు గురుగ్రామ్‌లో ఎంజీ రోడ్, నేషనల్ హైవే 8 వంటి ప్రధాన రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి.
దీంతో ఆయా మార్గాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. నజాఫ్‌గఢ్ లో సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు 60 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అధికారులతో సమావేశం అయ్యి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.






