- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్‌లో వరద బీభత్సం... 37 మంది మృతి
ఈ ఏడాది దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సైతం సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఈ అన్ని జిల్లాల్లో కలిపి 1.75 లక్షల హెక్టార్ల పంటనష్టం సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సైతం సంభవిస్తున్నాయి. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఈ అన్ని జిల్లాల్లో కలిపి 1.75 లక్షల హెక్టార్ల పంటనష్టం సంభవించింది. భారీ వర్షాలకు, వరదల కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 మంది మృతి చెందారు. నదులు, ప్రాజెక్టుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
అంతే కాకుండా రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతమైన ఫిరోజ్ పూర్‌లో సీఎం భగవంత్ మాన్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా వేరు వేరుగా పర్యటించారు. పంజాబ్ ప్రభుత్వం వరద ముంపు ప్రాంతాల్లో తక్షణ సాయం కింద రూ.71 కోట్లు ప్రకటించారు. ఎప్పటికప్పుడు అధికారులు, నాయకులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింభవళ్లు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 35 హెలికాప్టర్లను తక్షణ సాయం కోసం సిద్ధంగా ఉంచారు.






