ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ స్వాధీనం

by Disha Web Desk 4 |
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా కొకైన్ స్వాధీనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భారత్‌కు వస్తుంటారు. అయితే, ఇందులో కొందరు డ్రగ్స్‌ను సరఫరా చేసే వారు ఉంటారు. అలాంటి వారిని ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు గుర్తించి వారి నుంచి కొంత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటుటారు. అయితే, ఢిల్లీ విమానాశ్రయంలో మాత్రం ఒక్కసారిగా 5.85 కిలోల కొకైన్ లభ్యమవడం చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు ఏ విమానాశ్రయంలోనూ ఒక్కసారిగా ఇంత మొత్తంలో కొకైన్ దొరకలేదని అధికారులు వెల్లడించారు. అంతేగాకుండా, గత ఆరు నెలల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో 33.70 కిలోల హెరాయిన్, 12.60 కిలోల కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed