Heat wave: ఉత్తర భారతంలో హీట్ వేవ్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

by B.Srinivas |

రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటికీ ఉత్తర భారతం హీట్ వేవ్‌ను తలపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్‌లలో వేడి గాలులు వీస్తున్నాయి.

Heat wave: ఉత్తర భారతంలో హీట్ వేవ్.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటికీ ఉత్తర భారతం హీట్ వేవ్‌ (Heat wave) ను తలపిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో తీవ్ర వేడి గాలులు వీస్తు్న్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red allert) జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 14 వరకు తీవ్రమైన వేడి గాలులు కొనసాగుతాయని తెలిపింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీలో 45 డిగ్రీలతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. ఇక పంజాబ్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.4 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. అయితే 14వ తేదీ తర్వాత కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉందని అంచనా వేసింది.

Next Story