Heart attack: కర్ణాటకలో గుండెపోటు కలకలం.. 40 రోజుల్లోనే 22 మంది మృతి

by B.Srinivas |

హసన్ జిల్లాలో గుండెపోటు సంబంధిత మరణాలు ఆందోళన కలిగిస్తు్న్నాయి. హార్ట్ ఎటాక్ వల్ల 40 రోజుల్లోనే 22 మంది చనిపోయారు.

Heart attack: కర్ణాటకలో గుండెపోటు కలకలం.. 40 రోజుల్లోనే 22 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని హసన్ జిల్లా (Hasan distric) లో గుండెపోటు సంబంధిత మరణాలు ఆందోళన కలిగిస్తు్న్నాయి. ఆ జిల్లాలో హార్ట్ ఎటాక్ వల్ల కేవలం 40 రోజుల్లోనే 22 మంది చనిపోయారు. బాధితుల్లో ఎక్కువ మంది యువకులు, మధ్య వయస్సులే ఉన్నారు. 22 మందిలో 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్నవారు ఐదుగురు, 25 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఎమినిది మంది ఉన్నారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 30వ తేదీన ఒకే రోజు ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది. గుండెపోటు మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ సీఎన్ రవీంద్రనాథ్ (Ravindranath) నేతృత్వంలోని ఈ కమిటీ 10 రోజుల్లోపు వివరణాత్మక నివేదికను అందజేయాలని సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ఆదేశించారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణించి ఉండే అవకాశాలనూ తీసేయలేమని ఆయన తెలిపారు.

Next Story