- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రపతి రాజ్యాంగ సిఫార్సుపై సుప్రీం కోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) చేసిన రాజ్యాంగ సిఫార్సుపై దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) చేసిన రాజ్యాంగ సిఫార్సుపై దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్లు, రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు అనుమతి ఇవ్వడంపై ఉన్న అధికారాలకు సంబంధించి చీఫ్ జస్టిస్ బీ.ఆర్.గవాయ్ (Chief Justice B.R.Gavai) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్. నరసింహా, జస్టిస్ ఎ.ఎస్. చందుర్కర్ విచారణ చేపట్టారు. కేసులో తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.
చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. ఈ కేసును ఆగస్టులో విచారించాలని కోర్టు ప్రతిపాదిస్తోందని తెలిపారు. అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని కోర్టుక అసిస్ట్ చేయాలని ధర్మాసనం కోరింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కేంద్ర ప్రభుత్వం తరపున హాజరవుతానని, కేంద్రానికి నోటీసు అవసరం లేదని తెలిపారు. కేరళ రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది కె.కె.వేణుగోపాల్ (KK Venugopal) మాట్లాడుతూ.. రాష్ట్రపతి సిఫార్సు యొక్క నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతామని తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది పి.విల్సన్ మాట్లాడుతూ.. ఈ సిఫార్సులోని అంశాలు ఇప్పటికే తమిళనాడు గవర్నర్ కేసు తీర్పులో కవర్ అయ్యాయని, తమిళనాడు కూడా సిఫార్సు నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతామని ప్రకటించారు.






