kangana ranaut: న్యూయార్క్ కొత్త మేయర్ మామ్దానిపై బీజేపీ ఎంపీ కంగనా విమర్శలు

by S Gopi |

భారతీయుడి కంటే పాకిస్తాన్ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

kangana ranaut: న్యూయార్క్ కొత్త మేయర్ మామ్దానిపై బీజేపీ ఎంపీ కంగనా విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్‌గా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మామ్దానిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తరాలుగా రాజకీయాల్లో ఉన్న మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమోను భారీ తేడాతో ఓడించి భారతీయ-అమెరికన్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ గెలిచిన సంగతి తెలిసిందే. మామ్దాని మతపరమైన గుర్తింపుపై సొషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కంగనా పోస్ట్ చేశారు. అతను భారతీయుడి కంటే పాకిస్తాన్ లక్షణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతని తల్లి మీరా నాయర్ దేశ ఉత్తమ చిత్ర నిర్మాతలలో ఒకరు. న్యూయార్క్‌లో ఉన్నప్పటికీ భారత్‌లోనే పుట్టి పెరిగారు. ఆమె కుమారుడు మామ్దాని మాత్రం హిందూ మతాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి కూడా జోహ్రాన్ మామ్దానిపై విమర్శలు చేశారు. మాందాని భారత వ్యతిరేక వైఖరిపై స్పందిస్తూ దేశానికి అతనిలాంటి మిత్రులు అవసరం లేదని అన్నారు. మాందాని మాట్లాడితే పాకిస్తాన్ పీఆర్ టీమ్‌లు కూడా సెలవు తీసుకుంటాయి. అతని కల్పిత కథలు, వ్యాఖ్యానాలు ఆ స్థాయిలో ఉంటాయి. భారత్‌కు ఇటువంటి వ్యక్తులు మిత్రులుగా అక్కరలేదని సింఘ్వి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, తరాలుగా అమెరికా రాజకీయాల్లో ఉన్న మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమోను ఓడించి మాందాని గెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. తాను న్యూయార్క్ మేయర్ అయితే అనేక సంస్కరణలు తీసుకొస్తానని ఎన్నికల సమయంలో మాందాని హామీ ఇచ్చారు. ఇవి కాకుండా ఇంటి అద్దెలు పెరగకుండా చూస్తానని, ఉచితంగా రవాణా కల్పిస్తానని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలతోనే మాందాని విజయం దక్కించుకున్నారు.

Next Story