మద్యం మత్తులో నాగుపామును ముద్దాడాడు.. కాటు వేయడంతో.. (వీడియో)

by Disha Web Desk 4 |
మద్యం మత్తులో నాగుపామును ముద్దాడాడు.. కాటు వేయడంతో.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రమాదకరమని తెలిసిన కొంత మంది పాములతో ఆటలాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పామును పట్టడంలో అవగాహన లేకపోవడం, అది కాటు వేయడంతో చనిపోతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా బీహార్ నవాదా జిల్లాలోని గోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిలీప్ యాదవ్ అనే వ్యక్తి పీకల దాకా మద్యం తాగాడు. మద్యం మత్తులో పామును మెడలో వేసుకుని ముద్దాడాడు. కాసేపు పాముతో విన్యాసాలు చేశాడు. అది కాటు వేయడంతో మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిలీప్ యాదవ్ నివసిస్తున్నాడు. ఫుల్ గా మద్యం తాగి నాగుపామును చేతబుూని విన్యాసాలు చేశాడు. పామును ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత పామును మెడలో వేసుకుని ఆలయం ముందు శిరస్సు వంచి దండాలు పెట్టాడు. తనను క్షమించమని దేవుడిని కోరాడు. కాసేపు పామును మెడలో వేసుకుని డ్యాన్స్ చేశాడు. కాసేపటికి పాము కాటు వేయడంతో కిందపడిపోయాడు. ఆస్పత్రి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తేల్చారు.



Next Story

Most Viewed