- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తదుపరి ఉప రాష్ట్రపతి అతడే..! కోడైకూస్తున్న జాతీయ మీడియా
ఉపరాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ఆకస్మిక రాజీనామా అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉపరాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్ (Jagdeep Dhankhad) ఆకస్మిక రాజీనామా అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికపై అప్పుడు కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీ ఎంపీలను సంప్రదిస్తోంది. రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లను ఖరారు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మరో నెల రోజుల వ్యవధిలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చునేది ఎవరనే దానిపై దేశ వ్యాప్తంగా, జాతీయ మీడియాలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అయితే, బీజేపీ భావజాలాన్ని బలంగా వినిపిస్తున్న నేతను వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎంపిక చేస్తారని కథనాలు వెలువడుతోన్న వేళ మరోసారి ఎన్డీఏ పక్ష నేతకే ఆ పోస్టు దక్కబోతోందని తెలుస్తోంది.
కాగా, జేడీయూ నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ (Former CM Karpuri Thakur) కుమారుడు, కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ (Union Minister Ramnath Thakur) రేసులో ముందు ఉన్నట్లుగా కథనాలు ఊపందుకున్నాయి. ఇటీవల బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తో ఆయన భేటీ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. రామ్‌నాథ్ ఠాకూర్ ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. బిహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలోని కర్పూరి గ్రామంలో 1950, మార్చి 3న రామ్‌నాథ్ ఠాకూర్ జన్మించారు. జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి చెందిన ఆయన రాజ్యసభలో బీహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆయన రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కూడా ఎన్నియ్యారు. లాలూ ప్రసాద్ తొలి మంత్రివర్గంలో చెరుకు, పరిశ్రమల మంత్రిగా పని చేశారు. నవంబర్ 2005 నుంచి నవంబర్ 2010 వరకు నితీష్ కుమార్ మంత్రివర్గంలో రెవెన్యూ, భూ సంస్కరణలు, చట్టం, సమాచార, ప్రజా సంబంధాల మంత్రిగా రామ్‌నాథ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వర్తించారు.






