బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వతం.. నార్త్ ఇండియా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-25 04:30:30  IST  )

ఇథియోపియా దేశంలోని ఆఫార్ ప్రాంతంలో (Afar Region) ఉన్న హైలీ గుబ్బా (Hayli Gubba) అగ్నిపర్వతం బద్దలైంది.

బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వతం.. నార్త్ ఇండియా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇథియోపియా దేశంలోని ఆఫార్ ప్రాంతంలో (Afar Region) ఉన్న హేలీ గుబ్బి (Hayli Gubbi) అగ్నిపర్వతం బద్దలైంది. 10 నుంచి 12 వేల ఏళ్ల తర్వాత ఈ విస్ఫోటనం జరిగినట్లుగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎర్టా ఆలే (Erta Ale) అగ్నిపర్వతం నుంచి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో దక్షిణ-తూర్పు దిశలో హైలీ గుబ్బా పర్వతం ఉంది. ఎర్టా ఆలే శ్రేణిలో ఇది ఒక భాగమే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. అగ్నిపర్వతం బద్దలు కావడంతో ఎరుపు రంగు మేఘాలు 10 నుంచి 15 కి.మీ. ఎత్తుకు ఎగసి, దక్షిణ-పశ్చిమ అరేబియా, ఎర్ర సముద్రం వైపునకు విస్తరించాయి. డానాకిల్ డిప్రెషన్ (Danakil Depression)లోని టెక్టానిక్ ప్లేట్ల విభజన కారణంగా హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినట్లు తెలుస్తోంది. ఆఫార్ ట్రయాంగిల్ (Afar Triangle)లో ఆఫ్రికా, అరేబియా, సోమాలీ ప్లేట్లు విడిపోతున్న ప్రాంతం ఇక్కడే ఉండటం, మ్యాగ్మా ఉపరితలానికి రావడం ఇందుకు ప్రధాన కారణాలని సమాచారం.

నార్త్ ఇండియాపై తీవ్ర ప్రభావం..

ఇథియోపియాలో బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఇండియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాని పొగ అర్ధరాత్రి దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130 కిలో మీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్‌లో కనిపించింది. 25 వేల నుంచి 45 వేల అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లుగా వాతావరణ నిపుణులు తెలిపారు. హర్యానా, గుజరాత్, పంజాబ్, ఉత్తర ప్రదేవ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కూడా బూడిద వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది.

Read More..

బద్దలైన హేలీ గుబ్బి అగ్ని పర్వతం.. ఆకాశ ఎయిర్, ఇండిగో గల్ఫ్ ఫ్లైట్లు రద్దు

Next Story