బద్దలైన హేలీ గుబ్బి అగ్ని పర్వతం.. ఆకాశ ఎయిర్, ఇండిగో గల్ఫ్ ఫ్లైట్లు రద్దు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-25 04:31:48  IST  )

ఇథియోపియా (Ethiopia)లోని హేలీ గుబ్బి (Haley Gubbi) అగ్ని పర్వతం 10 వేల సంవత్సరాల తర్వాత ఆదివారం బ్లాస్ట్ అయింది.

బద్దలైన హేలీ గుబ్బి అగ్ని పర్వతం.. ఆకాశ ఎయిర్, ఇండిగో గల్ఫ్ ఫ్లైట్లు రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇథియోపియా (Ethiopia)లోని హేలీ గుబ్బి (Haley Gubbi) అగ్ని పర్వతం 10 వేల సంవత్సరాల తర్వాత ఆదివారం బ్లాస్ట్ అయింది. దీంతో దాదాపు 45 వేల అడుగుల ఎత్తుకు భారీ బూడిద ఆకాశంలోకి రాకాసిలా ఎగసిపడుతోంది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదిలిన ఈ మేఘం కొద్ది గంటల్లోనే భారత్-గల్ఫ్ మార్గాలను తాకింది. ఈ హఠాత్పరిణామంతో ప్రముఖ విమానయాన సంస్థలు ఆకాశ ఎయిర్ (Akasa Air), ఇండిగో (Indigo)లు రాబోయే రెండు రోజుల పాటు జెడ్డా, కువైట్, అబుదాబి నుంచి‌కు వెళ్లే అన్ని అంతర్జాతీయ ఫ్లైట్లను పూర్తిగా రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధులు తెలిపారు. ప్రీ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ 7 రోజుల్లోపు.. అదేవిధంగా ఉచిత రీ-బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లుగా ఆకాశ ఎయిర్‌లైన్ వెల్లడించింది. ఇక మరో విమానయాన సంస్థ ఇండిగో కన్నూరు-అబుదాబి ఫ్లైట్ (6E 1433)‌ను అహ్మదాబాద్‌కు డైవర్ట్ చేసింది.

Read More..

బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వతం.. నార్త్ ఇండియా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం

Next Story