రాత్రి వేళలో అయోధ్య రామ మందిర అద్భుత దృశ్యాలు చూశారా..?

by Sathputhe Rajesh |   (  Updated:2024-01-17 07:20:31  IST  )

రాత్రి సమయంలో అయోధ్య రామ మందిర ప్రాంగణంలోని అద్భుతమైన చిత్రాలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

రాత్రి వేళలో అయోధ్య రామ మందిర అద్భుత దృశ్యాలు చూశారా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాత్రి సమయంలో అయోధ్య రామ మందిర ప్రాంగణంలోని అద్భుతమైన చిత్రాలను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ నేపథ్యంలో ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రామ మందిరం ప్రాంగణం, కుబేర కోటపై ఏర్పాటు చేసిన జటాయువు విగ్రహం ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంది. రాత్రి సమయంలో మందిర ప్రాంగణం, స్తంభాలు, గోడలు, దేవతల బొమ్మలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరుగనుంది. జనవరి 14 నుంచి జనవరి 22 వరకు అయోధ్యలో అమృత మహోత్సవం ఉన్నట్లు ట్రస్ట్ తెలిపింది. అయోధ్యలో వేలాది మంది భక్తులకు వసతి కల్పించడానికి మైదాన ప్రాంతంలో అనేక డేరాలు ఏర్పాటు చేస్తున్నారు.

Next Story