- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hasina: షేక్ హసీనాకు షాక్.. మరో కేసు నమోదు చేసిన పోలీసులు
యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో హసీనా సహా మరో 72 మందిపై కేసు నమోదైంది.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina) కు మరో షాక్ తగిలింది. మహమ్మద్ యూనస్ (Mohammad yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో హసీనా సహా మరో 72 మందిపై కేసు నమోదైంది. బంగ్లాదేశ్ పోలీసుల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేసినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి కుట్ర పన్నారని ఆరోపించాయి. గతేడాది డిసెంబర్ 19న ఆన్ లైన్ సమావేశం జరిగిందని, ఈ మీటింగ్‌లో జాయ్ బంగ్లా బ్రిగేడ్ అనే వేదికను ఏర్పాటు చేసి హసీనా ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడంపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం చేయడంపై సైతం డిస్కస్ చేసినట్టు సీఐడీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేశారు.
కాగా, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు అనంతరం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలన అంతమైన విషయం తెలిసిందే. హసీనా దేశాన్ని వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. అనంతరం యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి షేక్ హసీనాపై హత్య, అవినీతి ఆరోపణలతో సహా సుమారు 100కి పైగా కేసులు నమోదయ్యాయి. అనేక మంది అవామీ లీగ్ నాయకులు అరెస్టయ్యారు. ప్రస్తుతం అవామీలీగ్ బంగ్లాదేశ్ రాజకీయాలకు దూరంగా ఉంది.






