Hasina: హసీనాకు రెడ్ కార్నర్ నోటీస్.. ఇంటర్‌పోల్‌కు బంగ్లాదేశ్ పోలీసుల విజ్ఞప్తి !

by B.Srinivas |

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సహా మరో 11 మందిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని బంగ్లాదేశ్ పోలీసులు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేశారు.

Hasina: హసీనాకు రెడ్ కార్నర్ నోటీస్.. ఇంటర్‌పోల్‌కు బంగ్లాదేశ్ పోలీసుల విజ్ఞప్తి !
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik haseena) సహా మరో 11 మందిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని బంగ్లాదేశ్ పోలీసులు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తి చేశారు. మహమ్మద్ యూనస్ (Mohammad Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసు జారీ చేయాలని తెలిపారు. బంగ్లాదేశ్ పోలీసులకు చెందిన నేషనల్ క్రైమ్ బ్యూరో (NCB) ఈ ధరఖాస్తు చేయగా ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు సంస్థల నుండి వచ్చిన అప్పీళ్ల ఆధారంగా ఎన్సీబీ ఈ అభ్యర్థన చేసినట్టు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎనాముల్ హక్ సాగర్ తెలిపారు. దీనిపై ఇంటర్ పోల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు.

దీంతో షేక్ హసీనాకు భారీ షాక్ తగిలినట్టు అయింది. పారిపోయి విదేశాల్లో నివసిస్తున్న వారిని గుర్తించడానికి ఇంటర్ పోల్ సహాయ పడుతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేస్తుంది. కాగా, గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెపై బంగ్లాదేశ్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమెపై అరెస్ట్ వారెంట్లు సైతం జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇంటర్ పోల్‌కు ధరఖాస్తు చేయడం గమనార్హం.

Next Story