- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోటోకు హారతి ఇచ్చి స్వాగత ర్యాలీ.. వీడియో వైరల్
రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4గంటలకు పుతిన్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ నేడు భారత పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 4గంటలకు పుతిన్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. పుతిన్ కోసం ఐదు అంచెల భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అయితే పుతిన్ పర్యటన నేపథ్యంలో హర్యానా ప్రజలు చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. పుతిన్ ఫోటోకు మంగళహారతి ఇచ్చి కొంతమంది పురుషులు మహిళలు కలిసి ర్యాలీ తీశారు. ర్యాలీ తీసినవాళ్లంతా మోడీ అభిమానుల్లా కనిపిస్తున్నారు.
పుతిన్ మోడీ దోస్తీ జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేశారు. భారత్ రష్యా స్నేహం జిందాబాద్ అంటే నినాదాలు చేశారు. గతంలో ట్రంప్ ఇండియాకు వచ్చిన సమయంలో కూడా ఇలాగే ఆయన ఫోటోలకు మంగళహారతి ఇచ్చి ర్యాలీ తీశారు. కానీ ట్రంప్ ఇప్పుడు భారత్ పై పన్నుల మోత మోగిస్తున్నారు. దీంతో నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ట్రంప్ అయిపోయాడు ఇప్పుడు పుతిన్ వచ్చాడా అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ అసలు పుతిన్ ఎవరో కూడా వాళ్లకు తెలిసి ఉండదు అంటూ కామెంట్ చేశాడు. VIDEO






