- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Haryana: భారత్‌లో అక్రమ నివాసం.. హర్యానాలో 39 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
ఎటువంటి చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా భారత్‌లో అక్రమంగా ఉంటున్న 39 మంది బంగ్లాదేశీయులను హర్యానా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎటువంటి చెల్లుబాటయ్యే పత్రాలు లేకుండా భారత్‌లో అక్రమంగా ఉంటున్న 39 మంది బంగ్లాదేశీయులను (Bangladesh) హర్యానా (Haryana) పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హిసార్‌లోని హన్సిలో అక్రమంగా నివసిస్తున్నట్టు తెలిపారు. వీరంతా చట్టవిరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించారని వెల్లడించారు. అరెస్టైన వారిలో 14 మంది పురుషులు, 11 మంది మహిళలు, 14 మంది పిల్లలు ఉన్నారు. బంగ్లా పౌరులంతా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉండగా వారు భారత్ లోకి ఎలా వచ్చారు, వారికి ఎవరు సాయం చేశారు అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వారిని బంగ్లాదేశ్‌కు పంపించనున్నారు. అప్పటి వరకు వారిని ఢిల్లీలోని నిర్భంధ శిబిరంలో ఉంచనున్నట్టు తెలుస్తోంది.
కాగా, ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ లేదా బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించడానికి అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మహేందర్‌గఢ్‌లోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న 14 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను ఇటీవల అరెస్టు చేశారు. వారి వద్ద నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి భారీగా బంగ్లాదేశ్ పౌరులు పట్టుబడటం గమనార్హం.






