Harvard: హార్వర్డ్ యూనివర్సిటీలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులు

by Shamantha N |

హార్వర్డ్‌ యూనివర్సిటీలో (Harward University) విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతి రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.

Harvard: హార్వర్డ్ యూనివర్సిటీలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హార్వర్డ్‌ యూనివర్సిటీలో (Harward University) విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి అనుమతి రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థించుకుండా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆ వర్సిటీలో మొత్తం 31 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పేర్కొన్నారు. ‘మొత్తం 31శాతం మంది విదేశీ విద్యార్థులున్నారనే విషయాన్ని హార్వర్డ్‌ ఎందుకు చెప్పడం లేదు. ఆ స్టూడెంట్లలో అమెరికా వ్యతిరేక దేశాల నుంచి వచ్చిన వాళ్లూ ఉన్నారు. ఆయా దేశాలు వారి విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. హార్వర్డ్‌ యూనివర్సిటీకి మేము బిలియన్‌ డాలర్లు చెల్లించాం. వారి వివరాలు తెలుసుకోవాలనే మా అభ్యర్థన సరైనదే. మాకు ఆ విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలు కావాలి. మీ దగ్గర రూ.442 కోట్లు ఉన్నాయిగా.. వాటినే ఉపయోగించుకోండి. డబ్బు కోసం ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయకండి’ అని ట్రంప్‌ రాసుకొచ్చారు.

హార్వర్డ్ వర్సిటీకి..

కాగా.. హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులు చేర్చుకునేందుకు ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ట్రంప్‌ చర్య అనైతికమని. నిబంధనలు ఉల్లంఘించడం అవుతుందని హార్వర్డ్‌ పేర్కొంది. ‘‘ఒక్క సంతకంతో యూనివర్సిటీలోని మొత్తం విద్యార్థుల్లో పావువంతు మందిని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని వెల్లడించింది. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి.. ట్రంప్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఇటీవలే ట్రంప్ సర్కారు హార్వర్డ్ కు అందించే నిధుల్లో కోత విధించింది.

Next Story