- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాగే వదిలేస్తే పెచ్చుమీరుతారు.. డిజిటల్ అరెస్టులపై సుప్రీం హాట్ కామెంట్స్
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ మోసాలు (cyber fraud), డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లను ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం పిలుపునిచ్చింది. ఈ సమస్యను ఉక్కు పడికిలితో పరిష్కరిస్తామని పేర్కొంది. ఇటీవల దేశంలో పెచ్చుమీరుతున్న డిజిటల్ అరెస్టులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ (MHA), సీబీఐ (CBI) సీల్డ్ కవర్ నివేదికను జస్టిస్ సూర్యకాంత్, జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక్క మనదేశంలోనే డిజిటల్ అరెస్టు బాధితుల నుంచి రూ.3వేల కోట్లు కొల్లగొట్టడం దిగ్భ్రాంతికరం అని ఇప్పుడు వీటిని మనం తీవ్రంగా తీసుకోకపోతే.. ఈ నేరగాళ్లు పెచ్చుమీరిపోతారని వ్యాఖ్యానించింది. వీటికి అడ్డుకట్టవేసేలా కఠినచర్యలు తీసుకోవాలని నిశ్చయించుకున్నామని పేర్కొంది. సాంకేతిక, ఆర్థిక విభాగాలు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో బాధితులు ఎక్కువగా వయోధికులే ఉన్నారని ఇది అత్యంత దయనీయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వెల్లడించారు. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం పని చేస్తోందని దీనిపై పలు చర్యలు తీసుకుంటున్నామని తుషార్ మెహతా వాదించారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు వివరాలు దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును కోరారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణ నవంబర్ 10కి వాయిదా వేసింది.
సుమోటోగా కేసు విచారణ:
డిజిటల్ అరెస్టుల (Digital arrest) విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఓ కేసును విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా మోసాల్లో డిజిటల్ కేటుగాళ్లు తమను తాము పోలీసు, సీబీఐ, ఈడీ అధికారులుగా చెప్పుకుంటూ తప్పుడు కోర్టు ఆదేశాలు చూపిస్తూ అమాయకులను టార్గెట్ చేస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సైబర్ నేరాలు వ్యవస్థలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయని ధర్మాసనం హెచ్చరింది. డిజిటల్ మోసాలకు సంబంధించి తమ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు, దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల సంఖ్య వంటి సమాచారం అందించాలని కోర్టు అన్ని రాష్ట్రాలు, యూటీలను ఆదేశించింది. ఈ అంశం మీద సీబీఐ దర్యాప్తు చేపట్టాలా వద్దా అనే అంశాన్ని కోర్టు నిర్ణయించే అవకాశం ఉందని. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.






