Harsh Goenka: ఒక కంపెనీ అంతా వాల్యూ లేదు మీకు మాతో ఫైటింగా?.. పాక్ పై ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్

by Prasad Jukanti |

పాకిస్తాన్ పై హర్ష్ గోయెంకా సెటైర్ వేశారు.

Harsh Goenka: ఒక కంపెనీ అంతా  వాల్యూ లేదు మీకు మాతో ఫైటింగా?.. పాక్ పై ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ఈసారి పాకిస్తాన్ పై సెటైర్ వేశారు. పాకిస్తాన్ (Pakistan) ను అదానీ (adani) వ్యాపారంతో పోల్చి చెబుతూ ఎద్దేవా చేశారు. కేవలం భారత దేశానికి చెందిన ఒక కంపెనీ మార్కెట్ విలువ వాళ్ల మొత్తం దేశం కంటే ఎక్కువ. అలాంటిది వాళ్లు మనతో ఫైటింగ్ చేసేందుకు ధైర్యం చేస్తున్నారంటూ పాకిస్తాన్ ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పాకిస్తాన్ తీరు ఎలా ఉందంటే కోహ్లీ వర్సెస్ గల్లీ క్రికెటర్, ఇస్రో వర్సెస్ గాలిపటం, షారుఖ్ ఖాన్ వర్సెస్ యూట్యూబ్ యాక్టర్, నాటు నాటు సాంగ్ వర్సెస్ స్కూల్ డ్యాన్స్, సీఎట్ టైర్స్ వర్సెస్ సైకిల్ టైర్ షాప్ ల ఉందని ఎక్కడా మ్యాచ్ కాదన్నారు.

అదానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం 161 బిలియన్ డాలర్లు అయితే పాకిస్తాన్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 50 బిలియన్ డాలర్లు అని ఆదాని, పునరుత్పాదక శక్తిలో అదానీ కంపెనీ 10.9 గిగా వాట్స్ అయితే పాకిస్తాన్ ది కేవలం 9-10 గిగా వాట్స్ మాత్రమేనని ఇక గ్రీన్ హైడ్రోన్ విషయంలో గ్లోబల్ లీడర్ షిప్ పై అదానీ ప్లాన్స్ చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మేజర్ ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టనే లేదన్నారు. పోర్టు ఆపరేషన్స్ లో అదాని 15 పోర్టులు నడుపుతుంటే పాకిస్తాన్ కేవలం 3 పోర్టులు మాత్రమే రన్ చేస్తోందని పోస్టు చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story