- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్‍స్టీన్ మంటలు.. జాతీయ రాజకీయాల్లో సంచలనం తప్పదా?
జాతీయ రాజకీయాల్లో ఎప్ స్టీన్ ఫైల్స్ పై రాజకీయ దుమారం కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్‌స్టిన్ సెక్స్ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు భారత జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎప్‍స్టిన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరు ఉందంటూ ఇవాళ లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హర్దీప్ సింగ్ స్పందించారు. తనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంటర్నేషనల్ పీస్ ఇనిస్టిట్యూట్ బృందంలో భాగంగా తాను ఎప్‍స్టిన్‍ను కలిశానని క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారే నేను ఎప్‌స్టిన్‍కు ఈమెయిల్ చేశానని, ఎప్ స్టీన్ ఐల్యాండ్ లో జరిగిన అనైతిక కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని ఆసమయంలోనూ నేను మేక్ ఇన్ ఇండియా గురించే మాట్లాడానని స్పష్టంత ఇచ్చారు. ఇవాళ న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిరాధార ఆరోణలు చేసే అలవాటు రాహుల్ గాంధీకి ఉందని హర్దీప్ సింగ్ ఫైర్ అయ్యారు.
విదేశాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు వచ్చేవాడిలా కాదు:
రాజకీయ వ్యవస్థలో రెండు రకాల నాయకులు ఉంటారని ఒక రకం నాయకులు బాధ్యతలు స్వీకరిస్తే మరొ రకం జీవితాలను ప్రజాసేవకు అంకితం చేసి దేశాన్ని మారుస్తారు. మేము రెండో రకం అన్నారు. పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్న భారత్ ను నాలుగో స్థానానికి తేగిగామన్నారు. దేశాన్ని త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. కొందరు విదేశాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు దేశానికి వచ్చే వాళ్లు ఉన్నారని ఆ నేతలు మాత్రం సభలో ప్రసంగాలు ఇచ్చి వెళ్లిపోతారని ప్రభుత్వం వివరణ ఇస్తుంటే వెంటనే వాకౌట్ చేస్తారని దుయ్యబట్టారు.
దేశ రాజకీయాలను షేక్ చేయబోతోందా?:
ఎప్‌స్టిన్ ఫైల్స్ వ్యవహారంలో ప్రతిపక్ష, అధికార పక్షం మధ్య ప్రస్తుంత వ్యాగ్యుద్ధం నడుస్తోంది. ఈ ఫైల్స్ కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ యూఎస్ కు సరెండర్ అయ్యారని తత్ఫలితంగానే ఆ దేశంతో ట్రేడ్ డీల్ కుదిరిందని రాహుల్ గాంధీ సెంట్రల్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం మన దేశ ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండానే ఈ డీల్ కుదిరిందని వాదిస్తోంది. ఈ డీల్ వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని క్లారిటీ ఇచ్చింది. అయినా రాహుల్ గాంధీ మాత్రం ఎప్‍స్టిన్ ఫైల్స్ లో ఉన్న మన దేశానికి చెందిన వారి పేర్లను ప్రస్తావిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఆరోపణలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఫైల్స్ పుణ్యమా అని యూకే వంటి అగ్రదేశాల్లోని రాజకీయాలు షేక్ అవుతున్నాయి. పలు దేశాల్లో రాజకీయ ముఖచిత్రాలు తారుమారు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలో దుమారం రేగిన ఎప్ స్టిన్ ఫైల్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీయబోతోందని అనేది ఉత్కంఠగా మారింది.






