Hamas: హమాస్ చెరలో 421 రోజుల చిత్రహింసలు.. భార్య, బిడ్డల కోసం ఎదురుచూపులు

by Shamantha N |

హమాస్‌ చెరలో 491 రోజులు బందీగా చిత్రహింసలు భరించి విడుదలైన ఇజ్రాయెల్ దేశస్థుడు(Israeli) ఎల్ షరాబీ Eli Sharabi) తన కుటుంబాన్ని కలుస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

Hamas: హమాస్ చెరలో 421 రోజుల చిత్రహింసలు.. భార్య, బిడ్డల కోసం ఎదురుచూపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌ చెరలో 491 రోజులు బందీగా చిత్రహింసలు భరించి విడుదలైన ఇజ్రాయెల్ దేశస్థుడు(Israeli) ఎల్ షరాబీ Eli Sharabi) తన కుటుంబాన్ని కలుస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, తన భార్యా పిల్లలు తనకు ఘనంగా స్వాగతం పలుకుతారని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసిన సమయంలో తాను బందీగా మారినా తన కుటుంబం ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉండి ఉంటుందని..తన కోసం ఎదురు చూస్తున్న వారిని వెంటనే కలిసేలా సహాయం చేయాలని ఇజ్రాయెల్‌ అధికారులను కోరాడు. అయితే 2023, అక్టోబర్ 7న జరిగిన హమాస్‌ దాడిలో అతడి భార్య లియాన్, కుమార్తెలు నోయా (16), యాహెల్ (13) ప్రాణాలు కోల్పోయారని అతడికి తెలియదు. తనతో పాటు బందీ అయిన తన సోదరుడి మరణవార్త మాత్రం అధికారులు అతడికి తెలియజేశారు. ఎల్‌ షరాబిను అతడి తల్లి, సోదరులకు అప్పగించారు. తన భార్యాపిల్లలను ఇంకెప్పుడూ కలవలేడనే విషయాన్ని తన సోదరుడికి ఎలా చెప్పాలని షరాబి సోదరుడు షారోన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

ముగ్గురు విడుదల

ఇకపోతే, శనివారం ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు విడుదల అయ్యారు. ఎల్‌ షరాబి(52), ఒహాద్‌ బెన్‌ అమి (56), ఓర్‌ లెవీ (34)లను రెడ్ క్రాస్ కి అప్పగించింది. ప్రతిగా ఇజ్రాయెల్‌ 183 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. అయితే, గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య జరిగిన ఐదో మార్పిడి ఇది. ఒప్పందం తొలిదశలో భాగంగా హమాస్‌ 33 మంది బందీలను, ఇజ్రాయెల్‌ దాదాపు 1,800కు పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది.

Next Story